logo

ప్రజల మధ్య ఐక్యత పెంచేవి క్రీడలు

క్రీడలు కుల, మతాలకు అతీతంగా దేశ ప్రజలను ఏకం చేస్తాయని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 23 Mar 2023 02:29 IST

క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న రేవంత్‌రెడ్డి, చిత్రంలో వి.హనుమంతరావు, కాంగ్రెస్‌ నేతలు

అంబర్‌పేట, న్యూస్‌టుడే: క్రీడలు కుల, మతాలకు అతీతంగా దేశ ప్రజలను ఏకం చేస్తాయని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం అంబర్‌పేట వాటర్‌వర్క్స్‌ మైదానంలో క్రికెట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వి.హనుమంతరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారత్‌ జోడో ఆలిండియా అండర్‌-19 (డే అండ్‌ నైట్‌) ట్వంటీ-20 లెగ్యూ క్రికెట్‌ ఛాంపియన్‌-2023 పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తమిళనాడు ఎమ్మెల్యే జేఎంహెచ్‌ హసన్‌, ఆర్‌.లక్ష్మణ్‌యాదవ్‌, జ్ఞానేశ్వర్‌గౌడ్‌, శంభుల శ్రీకాంత్‌గౌడ్‌, సయ్యద్‌ సాధిక్‌ పాషా, అమర్‌జీత్‌కుమార్‌, ఆది అవినాశ్‌, రజనీకాంత్‌, మోత రోహిత్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని