logo

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు 31 నుంచి

శోభకృత్‌ నామసంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ పేర్కొన్నారు.

Published : 23 Mar 2023 02:29 IST

ఏడాదంతా శోభాయమానమే: రంగరాజన్‌

పంచాంగ పఠనం చేస్తున్నరంగరాజన్‌

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: శోభకృత్‌ నామసంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ పేర్కొన్నారు. బుధవారం చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ ఆవరణలో పంచాంగ పఠనం నిర్వహించారు. అనంతరం చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఆలయ మేనేజింగ్‌ కమిటీ కన్వీనర్‌ గోపాలకృష్ణస్వామి, కన్నయ్య, సురేష్‌, అనిల్‌ పాల్గొన్నారు.

వివరాలు ఇలా.. ఈనెల 31న చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, ఏప్రిల్‌ 7న ముగియనున్నాయి. ః 31న ఉదయం సెల్వర్‌ కుత్తు, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం ః ఏప్రిల్‌ 1న ధ్వజారోహణం, శేష వాహనం ః 2న గోప వాహనం, హనుమంత వాహనం ః 3న సూర్యప్రభ, సాయంత్రం గరుడ వాహనం, రాత్రికి బాలాజీ కల్యాణోత్సవం ః 4న వసంతోత్సవం, గజ వాహనం ః 5న పల్లకీసేవ, రాత్రికి రథోత్సవం ః 6న మహాభిషేకం, ఆస్థానసేవ, దోప్‌సేవ, పుష్పాంజలి ః 7న ధ్వజావరోహణం, చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని