logo

హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టడం సరైందికాదు: ట్రస్మా

పదో తరగతి హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టడం సరైంది కాదని తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల అసోసియేషన్‌(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌రావు అన్నారు.

Published : 27 Mar 2023 00:37 IST

ఆమనగల్లు, న్యూస్‌టుడే: పదో తరగతి హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టడం సరైంది కాదని తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల అసోసియేషన్‌(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌రావు అన్నారు. ఆమనగల్లులోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్‌ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లపై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకుండా జారీ చేయడంతో పరీక్షలతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌, కోశాధికారి రమణారావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బీరప్ప, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని