logo

‘నా శ్రేయస్సే ప్రజా శ్రేయస్సు’ అనే ధోరణి కనిపిస్తోంది

లవకుశ’ దృశ్యకావ్యంలో ‘ప్రజా శ్రేయస్సే నా శ్రేయస్సుగా’ పరిపాలన చేస్తానని పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు చెబితే, నేడు ‘నా శ్రేయస్సే ప్రజా శ్రేయస్సు’ అనే ఆలోచనలు ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కనిపిస్తోందని అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌ అన్నారు.

Published : 01 Apr 2023 03:01 IST

నాగసుబ్రహ్మణ్యాన్ని సత్కరించిన జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌, చిత్రంలో లంక
లక్ష్మీనారాయణ, సారిపల్లి కొండలరావు, ఎస్వీ రామారావు  తదితరులు

రవీంద్రభారతి: ‘లవకుశ’ దృశ్యకావ్యంలో ‘ప్రజా శ్రేయస్సే నా శ్రేయస్సుగా’ పరిపాలన చేస్తానని పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు చెబితే, నేడు ‘నా శ్రేయస్సే ప్రజా శ్రేయస్సు’ అనే ఆలోచనలు ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కనిపిస్తోందని అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం యువ కళావాహిని ఆధ్వర్యంలో ‘లవకుశ’ షష్టిపూర్తి వేడుక రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా  చిత్రంలో ‘కుశ’ పాత్రధారి నాగసుబ్రహ్మణ్యాన్ని సత్కరించారు.లవకుశ చిత్రంలో ప్రతీ మాట నేటి సమాజానికి సందేశమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని