logo

అడవిలో కారు దగ్ధం

అనుమానాస్పద స్థితిలో కారు కాలిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెం మండలం పెద్దఎల్కిచర్ల గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

Published : 29 May 2023 03:14 IST

వాహనాన్ని పరిశీలిస్తున్న ఎస్సై సక్రమ్‌

జిల్లేడు చౌదరిగూడెం, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో కారు కాలిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడెం మండలం పెద్దఎల్కిచర్ల గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు ఇలా.. అడివికి సంబంధించిన సిబ్బంది(వాచర్‌) హజార్‌ పెట్రºలింగ్‌లో భాగంగా రాసకాల్వ కట్ట అటవీ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జిల్లేడు చౌదరిగూడెం ఎస్సై సక్రమ్‌ సంఘటన స్థలానికి చేరుకొని కాలిపోయిన కారు వివరాలు సేకరించారు. కారు(బెలెనో) నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా టీఎస్‌ 07 హెచ్‌ హెచ్‌ 5772గా గుర్తించారు. దీని ఆధారంగా కారు యజమాని (అఖిల్‌రెడ్డి) పేరున రిజిస్టర్‌ అయింది. ఘటనా స్థలంలోని పరిసరాలను పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా? కావాలనే చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఎన్నో అనుమానాలు.. ఈ ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. కారును కాల్వలోకి పోనిచ్చి కాల్చివేసి ఉంటారని.. బీమా సొమ్ము కోసం చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో పెద్దఎల్కిచర్ల, ముజాహిద్‌పూర్‌, చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకున్నారు. ఇదివరకు ఓ వ్యక్తిని హత్యచేసి కాల్చిన ఘటన ఇక్కడ జరిగింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు