logo

Hyderabad: ఒక్క వాట్సప్‌ వీడియోకాల్‌... రూ.19 లక్షలు హాంఫట్‌!

నగరంలోని విశ్రాంత ఉద్యోగిని సైబర్‌ నేరస్థులు బురిడీ కొట్టించారు. ఒక్క వాట్సప్‌ వీడియోకాల్‌తో రూ.లక్షలు కొట్టేశారు. సదరు విశ్రాంత ఉద్యోగి వారం క్రితం అంతర్జాలంలో బ్యాంకు కస్టమర్‌కేర్‌ నంబరు సేకరించారు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

Updated : 14 Dec 2023 08:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని విశ్రాంత ఉద్యోగిని సైబర్‌ నేరస్థులు బురిడీ కొట్టించారు. ఒక్క వాట్సప్‌ వీడియోకాల్‌తో రూ.లక్షలు కొట్టేశారు. సదరు విశ్రాంత ఉద్యోగి వారం క్రితం అంతర్జాలంలో బ్యాంకు కస్టమర్‌కేర్‌ నంబరు సేకరించారు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొంత సమయానికి బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌నంటూ ఓ వ్యక్తి వాట్సప్‌ ఫోన్‌కాల్‌ చేశాడు. బ్యాంకు ఖాతా సమస్యను పరిష్కరిస్తానంటూ వీడియోకాల్‌ చేశాడు. బాధితుడికి సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఆయన ఫోన్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించాడు. ఆ సమాచారం, స్క్రీన్‌షాట్లు తన నంబరుకు తెప్పించుకున్నాడు. అనంతరం బాధితుడి బ్యాంకుఖాతా నంబరు వివరాలు రాబట్టాడు. రెండ్రోజుల తరువాత విశ్రాంత ఉద్యోగి బ్యాంకు ఖాతానుంచి దఫాల వారీగా రూ.19.23లక్షలు వేర్వేరు ఖాతాల్లోకి జమయినట్టు ఫోన్‌కు సందేశాలు రావడంతో మోసపోయినట్టు గ్రహించాడు. అనంతరం బాధితుడి భార్య ఫోన్‌ నంబర్‌కు వాట్సప్‌ కాల్‌ చేసి బ్యాంకు వివరాలు చెప్పమంటూ అడగటంతో తిరస్కరించారు. బాధితుడి ఫిర్యాదుతో నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని