logo

నిబంధనలు పాటిస్తేనే ప్రజారోగ్యం పదిలం

మామిడి కాయలు పక్వానికి వచ్చేలా నిర్దేశించిన మోతాదుకు మించి ఎథెఫోన్‌ను వాడకూడదని అధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరు వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తుండటంతో ఐపీఎం (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌) ఆధ్వర్యంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పండ్ల మార్కెట్‌లపై దృష్టి సారించారు.

Updated : 27 Mar 2024 05:19 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే:  మామిడి కాయలు పక్వానికి వచ్చేలా నిర్దేశించిన మోతాదుకు మించి ఎథెఫోన్‌ను వాడకూడదని అధికారులు అవగాహన కల్పిస్తున్నా కొందరు వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తుండటంతో ఐపీఎం (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌) ఆధ్వర్యంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పండ్ల మార్కెట్‌లపై దృష్టి సారించారు. ప్రజారోగ్యం పదిలంగా ఉండాలంటే పండ్ల వ్యాపారులంతా ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ నిర్దేశించిన నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.  బాటసింగారంలోని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలోని పండ్ల మార్కెట్‌లో మంగళవారం మామిడి యార్డులో ఐపీఎం డైరెక్టర్‌ శివలీల ఆధ్వర్యంలో ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ డిప్యూటీ ఫుడ్‌ కంట్రోలర్‌ టి.విజయ్‌కుమార్‌, చీఫ్‌ ఫుడ్‌ అనలిస్ట్‌ జీఎల్‌ఎన్‌ రెడ్డి, ఏఎఫ్‌సీ యంఏ ఖలీల్‌ తదితర అధికారుల బృందం మామిడి యార్డుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. యార్డులోని వ్యాపారులు నిబంధనల మేరకే ట్రేకు నాలుగు వరకు ఎథెఫోన్‌ ప్యాకెట్లను ఏర్పాటు చేస్తున్నా.. కుమార్‌ అగర్వాల్‌ అనే వ్యాపారి  ట్రేకు ఆరు, ఏడు వరకు ఉంచుతున్నట్లు గుర్తించారు. అతడు అదనంగా ఎథెఫోన్‌ ప్యాకెట్లను మామిడి ప్యాకింగ్‌ చేసే ట్రేలలో ఉంచుతున్నట్లు తేల్చి 37 ట్రేల మామిడిని సీజ్‌ చేశారు. పండ్ల మార్కెట్‌ కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డి, యార్డ్‌ ఇన్‌ఛార్జి ఎస్‌ఏ లబాన్‌, యార్డ్‌ సూపర్‌వైజర్‌ ఎస్‌.మురళీధర్‌, డీఓలు ధర్మేంద్ర], టి.నాయక్‌, ఎఫ్‌ఎస్‌ఓలు సీహెచ్‌ ఉదయ్‌కిరణ్‌, టి.సునీత, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని