logo

గుండెకు అరుదైన శస్త్ర చికిత్స

దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్‌ సర్జరీ చేసినట్లు పల్స్‌ హార్ట్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ ఎంఎంఎస్‌ ముఖర్జీ తెలిపారు.

Published : 28 Mar 2024 03:15 IST

వివరాలు వెల్లడిస్తున్న డాక్టర్‌ ముఖర్జీ బృందం

మియాపూర్‌, న్యూస్‌టుడే: దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్‌ సర్జరీ చేసినట్లు పల్స్‌ హార్ట్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ ఎంఎంఎస్‌ ముఖర్జీ తెలిపారు. మియాపూర్‌ మాతృశ్రీ నగర్‌లోని ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశంలో శస్త్ర చికిత్స వివరాలను ఆయన వెల్లడించారు. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ లేకుండా రోగికి చికిత్స చేసి విజయం సాధించామని తెలిపారు. మినిమల్లీ ఇన్వాసివ్‌ సర్జరీతో కార్సినోయిడ్‌ గుండె జబ్బుతో బాధపడుతున్న 59 ఏళ్ల మహిళా రోగికి ట్రాన్స్‌కాథెటర్‌ పల్మనరీ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌(టీవీపీఆర్‌), ట్రైకస్పిడ్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ నిర్వహించి ఆమెకు కొత్త జీవితాన్ని కల్పించామని వివరించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ, డాక్టర్‌ మొవ్వా శ్రీనివాస్‌ నేతృత్వంలోని సర్జన్ల బృందం శస్త్ర చికిత్స లేకుండా రోగికి ట్రాన్స్‌కాథెటర్‌ పల్మనరీ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌, ట్రైకస్పిడ్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చికిత్స అందించామని తెలిపారు. టీవీపీఆర్‌ అనేది దేశంలోని ఎంపిక చేసిన కొన్ని వైద్య కేంద్రాలలో మాత్రమే చేయడానికి అవకాశమున్న అరుదైన ప్రక్రియ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని