logo

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. ఓటేసిన వాళ్లలో 19 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు.

Published : 29 Mar 2024 03:30 IST

ఓటు వేసి వస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

ఈనాడు, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. ఓటేసిన వాళ్లలో 19 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, చల్లా వెంకట్రాంరెడ్డి, సత్యవతి రాథోడ్‌, పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ తీరును పరిశీలించారు.   మొదటి ప్రాధాన్య ఓటుతోనే తాము గెలుస్తామన్న నమ్మకంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్లలో మెజారిటీ శాతం భారాసకు చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారని వారంతా తమకే ఓటు వేశారని భారాస అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నారు. ఏప్రిల్‌ 2న విజేత ఎవరో తేలనుంది. భారాస అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిలు పలు పోలింగ్‌ కేంద్రాల్లో పర్యటించి ఓటింగ్‌ సరళిపై ఆరా తీశారు.  షాద్‌నగర్‌లోని  పోలింగ్‌ కేంద్రంలో వంద శాతం ఓటింగ్‌ జరిగినట్లు ఆర్డీవో వేణుమాధవరావు తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని