logo

‘బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు భాజపా కుట్ర’

బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రజేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు.

Published : 03 May 2024 03:34 IST

మాట్లాడుతున్న శ్రీనివాస్‌గౌడ్‌

రాంనగర్‌: బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రజేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. గురువారం  దోమలగూడలోని బీసీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.కులగణన  హామీ ఇవ్వకపోవడం, మహిళా బిల్లులో బీసీలకు ఉప కోటా కల్పించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో ‘బీసీల రాజకీయ మేధోమథనం’ పేరిట సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్‌ ముదిరాజ్‌,  విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్‌, యువజన నాయకులు మధు, మహేశ్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని