logo

నేటి నుంచి తపాలా ఓటింగ్‌

ఈనెల 13న జరగనున్న పోలింగ్‌ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల ముందు తపాలా ఓటు, ఇంటివద్ద ఓటు ప్రక్రియలు మొదలు కాబోతున్నాయి.

Published : 03 May 2024 03:53 IST

హైదరాబాద్‌లో 17,296 మంది ఓటర్లు
ఇంటి వద్ద ఓటుకు 574 మంది వృద్ధులు

మాట్లాడుతున్న రోనాల్డ్‌రాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఈనెల 13న జరగనున్న పోలింగ్‌ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల ముందు తపాలా ఓటు, ఇంటివద్ద ఓటు ప్రక్రియలు మొదలు కాబోతున్నాయి. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, భద్రతా సిబ్బంది, వృద్ధులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోనున్నారు. మే 3 నుంచి 8 వరకు తపాలా ఓటు, మే 3 నుంచి 6 వరకు వృద్ధుల (85 ఏళ్లు పైబడిన)కు ఇంటి వద్ద ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇందుకోసం నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో మొత్తం 14 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌, హైదరాబాద్‌ పార్లమెంటు పరిశీలకులు శ్రీవిద్య, ఆర్వోలు హేమంత్‌ పాటిల్‌, మధుకర్‌ నాయక్‌, అదనపు కమిషనర్‌ సునంద పాల్గొన్నారు.

ఎక్కువ మందికి అవకాశం కల్పించాం

రోనాల్డ్‌ రోస్‌, జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్‌ పార్లమెంటు పరిధి ఓటర్లకు అబిడ్స్‌లోని ఆల్‌ సెయింట్స్‌ పాఠశాలలో, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానం ఓటర్లకు సికింద్రాబాద్‌ కేంద్రీయ విద్యాలయంలో, కంటోన్మెంట్‌ అసెంబ్లీ పరిధిలోని ఓటర్లకు కంటోన్మెంటు బోర్డు ఆఫీసులో తపాలా ఓటు కేంద్రాలను సిద్ధం చేశాం. ఆయా కేంద్రాల్లో ఎన్నికల ప్రచారానికి తావు లేదు. ఓటు నమోదు కేంద్రాల్లో అధికారులకు శిక్షణ పూర్తయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని