logo

సివిల్స్‌ ర్యాంకర్లను సత్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం సివిల్‌ సర్వీస్‌ ర్యాంకర్లకు మాత్రమే లబిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు.

Published : 04 May 2024 17:28 IST

హైదరాబాద్‌: భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం సివిల్‌ సర్వీస్‌ ర్యాంకర్లకు మాత్రమే లబిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణప్రదీప్‌ ట్వంటీఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ శిక్షణతో సివిల్స్‌ ర్యాంకులు సాధించిన 35 మందిని వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన ఈకార్యక్రమంలో దూరదర్శన్‌ మాజీ అదనపు డీజీ పద్మనాభరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ‘‘ఈ పయనం మీ జీవితాల్నే కాదు.. ఈ దేశాన్నే మారుస్తుంది. సమాజం, ప్రజలు, దేశం అన్నింటిలో పరివర్తన తీసుకొస్తుంది. మీది కేవలం ఉద్యోగం కాదు.. భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశం. మీ నిబద్ధతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. మీపై అనేక ఒత్తిడిలు ఉంటాయి. రాజకీయ బాస్‌లు ఉంటారు. కానీ, మీకు అసలైన బాస్‌ ఎవరంటే దేశ ప్రజలే’’ అని సివిల్స్‌ ర్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని