logo

పాలమూరుకు ఏంచేశారో సీఎం చెప్పాలి: అరుణ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని పాలమూరు లోక్‌సభ భాజపా అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్‌ వచ్చిన ఆమె స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో మాట్లాడుతూ పాలమూరుకు రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

Published : 08 May 2024 03:43 IST

మాట్లాడుతున్న భాజపా అభ్యర్థి డీకే అరుణ

కొడంగల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని పాలమూరు లోక్‌సభ భాజపా అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్‌ వచ్చిన ఆమె స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో మాట్లాడుతూ పాలమూరుకు రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మా తండ్రి, మా మామ కుటుంబాలు స్వాతంత్య్ర సమయంలో ఎనలేని పోరాటం చేశాయని, రేవంత్‌రెడ్డి కుటుంబం దేన్లో పోరాడిందో చెప్పాలన్నారు. మహిళ అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని..కేసీˆఆర్‌ దిగిపోవడానికి 10 సంవత్సరాలు పట్టింది కానీ, రేవంత్‌రెడ్డి దిగిపోవడానికి 10 నెలలు కూడా పట్టదని హెచ్చరించారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి మాట్లాడారు. 

జనార్దన్‌ రెడ్డి మద్దతు కోరిన కొండా

వికారాబాద్‌ టౌన్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ మంగళవారం గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన జనార్దన్‌ రెడ్డిని భాజపా అభ్యర్థి కొండావిశ్వేశ్వర్‌ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పార్లమెంట్‌ భాజపా ఇన్‌ఛార్జిగా  పనిచేసిన అనుభవం తనకు ఎంతో ఉపయోగపడుతుందని, సహకరించి గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు.

గాంధీ కాలనీలో  ప్రచారం చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి సతీమణి సంగీతారెడ్డి

వికారాబాద్‌టౌన్‌, వికారాబాద్‌, న్యూస్‌టుడే: చేవెళ్ల పార్లమెంట్‌ భాజపా ఎంపీగా రెండోసారి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని గెలిపించి ఆశీర్వదించాలని ఆయన సతీమణి సంగీతారెడ్డి ఓటర్లను కోరారు. మంగళవారం జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని గాంధీ కాలనీ, ఎల్లమ్మతోట, సాకేత్‌నగర్‌, ఎన్నెపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో భాజపా మహిళా నేతలు సుచరితారెడ్డి, యాస్కి శిరీష, మాడం రాము, మలికార్జున్‌, దత్తు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు