logo

సారొచ్చారు.. హోరెత్తించారు

తెలంగాణ హక్కులు కాపాడుకోవాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో భారాస సత్తా చాటాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

Updated : 09 May 2024 05:41 IST

ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్‌
న్యూస్‌టుడే, పటాన్‌చెరు, పటాన్‌చెరు అర్బన్‌ : తెలంగాణ హక్కులు కాపాడుకోవాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో భారాస సత్తా చాటాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు.  కేసీఆర్‌ బస్సు యాత్రలో భాగంగా పటాన్‌చెరులో బుధవారం రాత్రి రోడ్‌ షో నిర్వహించి మాట్లాడారు.  దేశ సంపద అంతా అంబానీ అదానీలకు దోచి పెడుతున్నారని, వారికి రూ.లక్షల కోట్ల అప్పులు మోదీ మాఫీ చేస్తున్నారన్నారు.  విజ్ఞులైన ప్రజలు ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. పటాన్‌చెరును పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేశామన్నారు. నిరంతర విద్యుత్తు, టీఎస్‌ ఐపాస్‌ వల్ల కొత్త పరిశ్రమలు వచ్చి బాగా అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప మిగిలినవేవీ అమల్లోకి రాలేదని కేసీఆర్‌ అన్నారు. పాత పింఛను ఒక నెల ఎగ్గొట్టారన్నారు.  ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, పటాన్‌చెరు, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు మహిపాల్‌ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు దుండిగల్‌లో జరిగిన కేసీఆర్‌ రోడ్‌షోలో మాజీ మంత్రి మల్లారెడ్డి నృత్యం చేయడం శ్రేణుల్లో జోష్‌ నింపింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని