logo

మృతి చెందితే రూ.2 లక్షలు.. గాయపడితే రూ.50 వేలు

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని వాహనాల ఆచూకీ లభ్యం అవుతుండగా.. మరికొన్ని ఆచూకీ లభించటంలేదు.

Published : 23 May 2024 02:55 IST

గుర్తు తెలియని వాహనం ఢీకొడితే పరిహారం
పథకం అమలైతే బాధితులకు సాయం
న్యూస్‌టుడే, జగిత్యాల గ్రామీణం

ప్రమాద దృశ్యం (పాత చిత్రం)

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని వాహనాల ఆచూకీ లభ్యం అవుతుండగా.. మరికొన్ని ఆచూకీ లభించటంలేదు. దీంతో క్షతగాత్రుల ఆసుపత్రి ఖర్చులకు కూడా కనీస పరిహారం అందటంలేదు. కేసు నమోదు చేసినా వాహనం ఆచూకీ దొరకక చాలా కేసులు నీరుగారి పోతున్నాయి. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి వీధిన పడుతోంది. ఇలాంటి వారికి ప్రభుత్వం సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల చట్టం 1988ని 2019లో సవరణ చట్టం చేసింది. ఇందులో భాగంగానే హిట్‌.. రన్‌ చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టంలో భాగంగా బాధితులకు సాయం అందించేందుకు కేంద్రం గత శాసన సభ ఎన్నికలకు ముందు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే బాధిత కుటుంబాలకు కాస్త ఊరట కలగనుంది.  

జిల్లాస్థాయి కమిటీ..

గుర్తు తెలియని వాహన ప్రమాద బారిన పడి ఎవరైనా మృతి చెందితే రూ.2 లక్షలు పరిహారం అందనుంది. గాయపడిన వారికి రూ.50 వేలు అందనున్నాయి. దీని కోసం జిల్లా స్థాయిలో ఓ కమిటీ వేయనుంది. కమిటీ జిల్లా కలెక్టర్, ఎస్పీ, రవాణశాఖ అధికారి, ఇన్సూరెన్స్‌ కంపెనీ నిర్వాహకులు.. ఇంకా కొంతమంది ఉండనున్నారు. ఈ కమిటీ నిర్ణయం మేరకు బాధితులకు సాయం అందనుంది. ఈ ఉత్తర్వులు జగిత్యాల జిల్లా పోలీసు, రవాణ శాఖకు ఉత్తర్వులు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వస్తే కమిటీ ఏర్పాటై సాయం అందనుందని ఓ అధికారి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని