logo

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్తు ఉద్యోగుల నిరసన

కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే చట్ట సవరణను విరమించుకోవాలని కోరుతూ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు బుధవారం కరీంనగర్‌లోని సర్కిల్‌ కార్యాలయం

Published : 09 Dec 2021 05:24 IST

నిరసన తెలుపుతున్న విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు

భగత్‌నగర్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే చట్ట సవరణను విరమించుకోవాలని కోరుతూ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు బుధవారం కరీంనగర్‌లోని సర్కిల్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీఓఈఈఈసీ జిలా కన్వీనర్‌ కె.అంజయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మొండివైఖరితో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరిస్తే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, రైతులు తీవ్రంగా ఇబ్బందిపడతారన్నారు. ఈ నెల 15న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ ర్యాలీ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టగానే మెరుపు సమ్మెకు దిగుతామన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కె.అంజయ్య, ఎన్‌.అంజయ్య, ఎన్‌.పద్మారెడ్డి, కె.శ్రీనివాస్‌, భాస్కర్‌, సంపత్‌, రమేశ్‌, కిరణ్‌, రఘుపతి, జనార్దన్‌, సుధీర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని