logo

శిథిలావస్థలో పంచాయతీ భవనాలు

కొడిమ్యాల మండలంలోని పలు గ్రామపంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేయడంతో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు భయం భయంగానే పరిపాలన కొనసాగిస్తున్నారు. భవనాలు శిథిలావస్థకు చేరడం, ఇరుకుగా సరైన సౌకర్యాలు

Published : 17 Jan 2022 02:47 IST

ఇబ్బందులు పడుతున్న పాలకవర్గాలు
కొడిమ్యాల, న్యూస్‌టుడే

తిర్మలాపూర్‌ గ్రామపంచాయతీ భవనం

కొడిమ్యాల మండలంలోని పలు గ్రామపంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేయడంతో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు భయం భయంగానే పరిపాలన కొనసాగిస్తున్నారు. భవనాలు శిథిలావస్థకు చేరడం, ఇరుకుగా సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాలకవర్గ సభ్యులు, అధికారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.  

పెచ్చులూడుతున్న పైకప్పు...
మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామపంచాయతీ భవనాన్ని 1973లో నిర్మించగా ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. కోనాపూర్‌ గ్రామపంచాయతీ భవనం సైతం 1975లో నిర్మించగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడుతోంది. దీంతో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు శిథిల భవనంలోనే భయం భయంగా పరిపాలన సాగించాల్సి వస్తొంది. ముఖ్యంగా వర్షాకాలంలో భవనం ఉరవడం, పెచ్చులూడుతుండడం, సర్పంచులు, సిబ్బంది కూర్చోవడానికి గదులు లేక ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. పాత భవనాలకు మరుగుదొడ్ల సదుపాయం కూడా లేకపోవడంతో ఒకటికీ, రెంటికీ అవస్థలు పడుతున్నారు. కోనాపూర్‌లో పాలకవర్గ సమావేశాలు సైతం భవనం ఆవరణలో నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్‌, అధికారులకు పలుమార్లు నూతన భవనం కోసం వినతిపత్రం సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు.  

శిథిలావస్థకు చేరిన కోనాపూర్‌ పంచాయతీ భవనం


ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి
- గంగుల పద్మ, తిర్మలాపూర్‌ సర్పంచి

గ్రామపంచాయతీ భవనం నిర్మించి సుమారు 45 ఏళ్లు పైబడటంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులూడుతుండడంతో పాటు గోడలు బీటలుబారి ఉన్నాయి. వర్షాకాలం భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతోనే పరిపాలన సాగిస్తున్నాం. గదులు ఇరుకుగా ఉండటంతో ఒకే గదిలో సర్పంచి, కార్యదర్శి కూర్చుండాల్సి వస్తోంది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం లేదా ఉపాధిహామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేసి నూతన భవన నిర్మించాల్సిందిగా కోరుతున్నాం.


నిధులు మంజూరు చేయాలి
- చెక్కపెల్లి స్వామిరెడ్డి, కోనాపూర్‌ సర్పంచి

గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో వర్షాకాలం పూర్తిగా గదులన్నీ ఉరుస్తున్నాయి. పైకప్పు తరచూ పెచ్చులూడుతుండటంతో పాలకవర్గ సభ్యులు, అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. గదులు ఇరుగ్గా ఉండటంతో కార్యాలయం బయటనే సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. గతంలో నూతన గ్రామపంచాయతీ భవనం కోసం జిల్లా కలెక్టర్‌, అధికారులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ స్పందనలేదు. నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి సమస్యలు పరిష్కరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని