logo

చక్కెర కర్మాగారాలను తెరిపించాలి

ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్రం నాబార్డు ద్వారా రాయితీ ఇస్తుందని, మంత్రి కేటీఆర్‌, ఎంపీ అర్వింద్‌కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాయితీ కల్పించి రాష్ట్రంలో ఖాయిలాపడిన

Published : 21 Jan 2022 03:18 IST

   

మెట్పల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్రం నాబార్డు ద్వారా రాయితీ ఇస్తుందని, మంత్రి కేటీఆర్‌, ఎంపీ అర్వింద్‌కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాయితీ కల్పించి రాష్ట్రంలో ఖాయిలాపడిన బోధన్‌, ముత్యంపేట, ముంబోజిపల్లి చక్కెర కర్మాగారాలను తెరిపించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం మెట్పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించాలన్న యోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. వాటిని అమ్మకానికి పెడితే కొనుగోలు పేరిట ఆస్తులు కాజేయడానికి తెరాస, భాజపా నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చక్కెర పరిశ్రమలను తనకు అప్పగిస్తే నడిపిస్తానన్న నైతిక హక్కు ఎంపీˆ అర్వింద్‌కు లేదన్నారు. ఎన్నికల్లో గెలిచాక వంద రోజుల్లో చక్కెర కర్మాగారాలను తెరిపిస్తానని హామీ ఇచ్చిన తెరాస నాయకులు వంద రోజుల్లో కర్మాగారాలు మూతపడేలా చేశారని విమర్శించారు. ఆదిలాబాద్‌లో సిమెంట్ కర్మాగారాన్ని తెరిపించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్న మంత్రి కేటీఆర్‌కు చక్కెర కర్మాగారాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. వంద రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని పత్రాలు రాసిచ్చిన ఎంపీ అర్వింద్‌ స్పైస్‌ పరిశ్రమను తెచ్చానని రైతులను మోసం చేస్తున్నారన్నారు. పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జెట్టి లింగం, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అల్లూరి మహేందర్‌రెడ్డి, బండ శంకర్‌ పాల్గొన్నారు.  

కోరుట్లగ్రామీణం: కోరుట్ల మండలం గుంలాపూర్‌ గ్రామానికి చెందిన సింగిల్‌ విండో డైరక్టర్‌ గడ్డం గంగారాజంగౌడ్‌ ఇటీవల ప్రమాదవశాత్తు జారీపడగా కాలువిరిగింది. గురువారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గంగారాజంను పరామర్శించారు. మహిపాల్‌రెడ్డి, కొంతం రాజం, సత్యం, నషీర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని