logo
Published : 27 Jun 2022 04:28 IST

సార్లు ఎప్పుడొస్తారో!

గనుల శాఖలో ఇన్‌ఛార్జిలతో ఇక్కట్లు
న్యూస్‌టుడే, తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌)

జిల్లా భూగర్భ గనుల శాఖ కార్యాలయం

హజ సంపదకు పేరుగాంచింది కరీంనగర్‌ జిల్లా. ఇక్కడ ఖనిజ తవ్వకాలు, ఇసుక క్వారీలతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో వందలాది గ్రానైట్ క్వారీలు, వాటికి అనుబంధంగా కటింగ్‌ పరిశ్రమలు నెలకొల్పారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, చైనా లాంటి దేశాలకు బ్లాక్‌లు(బండ) ఎగుమతి చేస్తారు. గ్రానైట్ కూడా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. ప్రతి ఏటా లీజులు, రాయల్టీ రూపేణా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజనాకు వెళుతోంది. అలాంటి శాఖకు పూర్తిస్థాయిలో అధికారులు లేక పర్యవేక్షణ కొరవడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నారు.

ఎప్పుడు ఉంటారో...
నిజామాబాద్‌లో భూగర్భగనుల శాఖ ఏడీగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణకు కరీంనగర్‌లో సహాయసంచాలకుని (ఏడీ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు చోట్లా విధులు నిర్వహించాల్సి రావడంతో పనిభారం పడుతోంది. ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఉంది. వారంలో సగం రోజులు అక్కడ, సగం రోజులు కరీంనగర్‌లో విధులకు హాజరవుతుండటంతో వ్యాపారులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు సెలవు రోజులు, ఉన్నతాధికారులతో శాఖాపరమైన సమావేశాలు ఉంటే రాలేని పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఇక్కడ ఏజీగా పనిచేస్తున్న రవిబాబును జయశంకర్‌ భూపాలపల్లి (ములుగు) జిల్లాకు ఇన్‌ఛార్జిగా నియమించారు. ఏజీ కూడా మూడు రోజులు అక్కడ, మూడు రోజులు ఇక్కడ పనిచేయాల్సి వస్తోంది. కరీంనగర్‌లో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్‌కు కూడా అదనంగా అక్కడే అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన కూడా నెలలో 20 రోజులు కరీంనగర్‌లో మిగితా రోజులు జయశంకర్‌ భూపాలపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా భూగర్భగనుల శాఖలో ఆర్‌ఐగా పనిచేస్తున్న సైదులుకు కరీంనగర్‌ జిల్లా  అదనపు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమైన అధికారులకు పోస్టింగ్‌ ఓ చోట, మరోచోట ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తుండటంతో ఎవరు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
్య క్వారీల నుంచి బండలు తీయడం, ఎగుమతి చేసే సమయంలో వాటి కొలతలు నిర్ధారించడం, రాయల్టీ, అనుమతులు, కొత్త క్వారీలు, సర్వేలు ఇలా అనేక పనుల కోసం నిత్యం అనేక మంది గనులశాఖ కార్యాలయానికి వస్తుంటారు. వీటితో పాటు గ్రానైట్ కటింగ్‌, పాలిషింగ్‌ పరిశ్రమలు, కంకర క్వారీల్లో తవ్వకాల తనిఖీ, పరిమితికి మించి తవ్వకాలు జరగకుండా చూడటం, అక్రమాలు జరగకుండా నియంత్రించడం సంబంధిత అధికారులపై ఉంటుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం లాంటివి కూడా చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ‘మన ఇసుక వాహనం’ పథకానికి సంబంధించి జిల్లాలో ఇసుక క్వారీలను గుర్తించారు. వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా గనులశాఖపైనే ఉంది.

చొరవ తీసుకోవాలి
గ్రానైట్ క్వారీలు, పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో అధికారులను నియమించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

ఆదాయం ఇలా
గనుల శాఖకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.11,742.74 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో కలర్‌ గ్రానైట్ ద్వారా రూ.88.26 కోట్లు, స్టోన్‌ మెటల్‌ ద్వారా రూ.43.97 లక్షల ఆదాయం ఆర్జించింది. మిగితా ఆదాయం కటింగ్‌ పరిశ్రమలు, రెన్యూవల్‌, ఇతర మార్గాల ద్వారా వచ్చింది. సర్కారుకు ఏటా కోట్లాది రూపాయలు వస్తున్నా ఇప్పటివరకు ఆ శాఖ కార్యాలయానికి సొంత భవనం లేదు. అరకొర వసతుల మధ్య విధులు కొనసాగిస్తోంది.

జిల్లాలో ఇలా....
* క్వారీలు 297
* స్టోన్‌ మెటల్‌ 31
* క్వార్ట్జ్‌ 1
* కటింగ్‌ పరిశ్రమలు 280 కి పైగా

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts