logo

అగ్నిపథ్‌ రద్దుకు పోరాటం

ఇటీవల కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల సంప్రదాయాన్ని, నైతికతను తారుమారు చేస్తూ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రకటించిన అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 28 Jun 2022 05:14 IST

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌


కరీంనగర్‌లో కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష, పాల్గొన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ సుభాష్‌నగర్‌: ఇటీవల కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల సంప్రదాయాన్ని, నైతికతను తారుమారు చేస్తూ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రకటించిన అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని ఇందిరాచౌక్‌లో కరీంనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొని ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యంత ప్రాధాన్యమైన కిసాన్‌, జవాన్లకు మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు. దేశ సైనిక వ్యవస్థను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎం.రోహిత్‌రావు ముకరంపుర నుంచి ర్యాలీగా సత్యాగ్రహ దీక్షకు వచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.పద్మాకర్‌రెడ్డి, నాయకులు తాజ్‌, శ్రావణ్‌నాయక్‌, ఎం.మోహన్‌, చెర్ల పద్మ, సుజిత్‌కుమార్‌, అబ్దుల్‌ రహ్మన్‌, విలాస్‌రెడ్డి పాల్గొన్నారు.

* తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పిన తర్వాతే ప్రధాని మోదీ, అమిత్‌షా రాష్ట్రానికి రావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మోదీ రాక సందర్భంగా నిరసనలు తెలిపే కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకత్వం తీసుకోవాలని కోరారు. యువత స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని