logo

రైతు సమస్యలపై కాంగ్రెస్‌ పోరాటం

రైతు సమస్యల పరిష్కారానికే కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని మాజీమంత్రి, శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు.

Published : 04 Dec 2022 05:54 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: రైతు సమస్యల పరిష్కారానికే కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని మాజీమంత్రి, శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. ధరణితో భూసమస్యలు పెరిగాయన్నారు. సూరమ్మ ప్రాజెక్టుకు 2018లో శంకుస్థాపన జరిగినా పనులు జరగడం లేదన్నారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు గండిపడి ఎండిపోయిందని, మోతె చెరువుకు రెండుసార్లు గండిపడగా.. ఆరగుండాల ప్రాజెక్టు పునఃనిర్మాణానికి నోచుకోలేదన్నారు. ముత్యంపేట చక్కెర కర్మాగారం పునఃప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో పసుపుబోర్డు తెస్తానని బాండ్‌ రాసిచ్చిన ఎంపీ అర్వింద్‌ క్రిమినల్‌ చర్యలకు అర్హుడని ఆరోపించారు. పీసీసీ సభ్యుడు గిరినాగభూషణం, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, పురపాలక ఫ్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, జిల్లా ఎస్సీ, మైనార్టీ విభాగాల అధ్యక్షులు ధర రమేష్‌బాబు, మన్సూర్‌, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని