logo

నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం

నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్‌ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Published : 24 Apr 2024 05:35 IST

అయిదుగురి అరెస్టు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్‌ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. కరీంనగర్‌ రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌ ఆదర్శనగర్‌కు చెందిన మహ్మద్‌ లతీఫ్‌ రేకుర్తిలో 248 చదరపు గజాల ఇంటి స్థలాన్ని సిద్దిపేటకు చెందిన సయ్యద్‌ జైనబీ భర్త నిజామొద్దీన్‌ వద్ద కొనుగోలు చేశాడు. గ్రామ పంచాయితీ అనుమతి తీసుకొని కొత్త ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటున్నాడు. 2023 మే 13న బారాజు రత్నాకర్‌రెడ్డి (కరీంనగర్‌ విద్యానగర్‌), చందా శంకర్‌రావు (సాయినగర్‌), బకిట్ సాయి (రేకుర్తి), పిట్టల మధు (జ్యోతినగర్‌), షాహిద్‌ఖాన్‌ (ముకరంపుర)లు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి, అందులో ఉన్న వారిపై దాడి చేసి బయటకు పంపించారు. జేసీబీతో ఇంటిని ధ్వంసం చేశారు. సయిదాఖాన్‌ వారసులతో ఒప్పందం అయిందని నకిలీ పత్రాలు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడు మహ్మద్‌ లతీఫ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన అయిదుగురిపై కేసు నమోదు చేశారు. మంగళవారం వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని