logo

ఆదాయం ఘనం.. వసతులు శూన్యం

ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు.

Published : 27 Apr 2024 05:25 IST

న్యూస్‌టుడే, మెట్‌పల్లి పట్టణం

ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. మార్కెట్‌యార్డులో ఫ్లాట్‌ఫాంలు సరిగా లేక చిన్నపాటి వర్షం కురిసినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫ్లాట్‌ఫాంలపై సీసీ సరిగా లేక గుంతలు ఏర్పడి కంకర రాళ్లు తేలి వర్షం నీరంతా గుంతల్లో నిలుస్తోంది. యార్డులో కాల్వలు లేక వర్షం నీరంతా ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉంది. పందులు, పశువులు సంచరిస్తూ పంట ఉత్పత్తులను నష్టపరుస్తున్నాయి.  

మెట్‌పల్లి మార్కెట్‌ యార్డులో రైతులు పండించిన పసుపు, మక్కలు, వడ్లు తదితర పంటలను విక్రయిస్తుంటారు. ఏటా ప్రభుత్వం ఇచ్చే లక్ష్యాన్ని అధిగమిస్తునే రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మార్కెట్‌కు వ్యాపారుల ద్వారా, చెక్‌పోస్టు, సివిల్‌ సప్లయి, ఐకేసీ కేంద్రాల ద్వారా ఆదాయం వస్తోంది. 2023-2024 ప్రభుత్వ లక్ష్యం రూ.227 లక్షలు ఉండగా రూ.228.77 లక్షలు సాధించింది. సివిల్‌ సప్లయి నుంచి రూ.149.15 లక్షలు, చెక్‌పోస్టు నుంచి రూ.33.16 లక్షలు, వ్యాపారుల నుంచి రూ.46.46 లక్షలు ఆదాయాన్ని పొందింది. 2016లో అప్పటి పాలకవర్గంతో పాటు అధికారుల అనాలోచిత విధానంతో రూ.12 లక్షలు ఖర్చు చేసి యార్డులో ఏర్పాటు చేసిన ధర్మకాంటా రైతులకు ఉపయోగపడడం లేదు. ధర్మకాంటాను ఎత్తులో ఏర్పాటు చేయడంతో లారీలు పైకి ఎక్కలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రస్తుతం మార్కెట్‌ కార్యాలయాన్ని నిర్మించడంతో ధర్మకాంటా కార్యాలయాన్ని తొలగించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి మార్కెట్‌లో సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని