logo

పోలింగ్‌ కేంద్రం.. సమగ్ర సమాచారం

ఓటర్లకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల జాబితా, స్లిప్పుల పంపిణీ నుంచి మొదలుకొని పోలింగు నిర్వహణ వరకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు

Published : 01 May 2024 03:12 IST

గోదావరిఖనిలోని ఓ పోలింగ్‌ కేంద్రం ముందు ఏర్పాటు చేసిన జాబితా

టర్లకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల జాబితా, స్లిప్పుల పంపిణీ నుంచి మొదలుకొని పోలింగు నిర్వహణ వరకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించేలా వారి పేరు, వివరాలు, చరవాణి నెంబర్లతో ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద జాబితాలను ఏర్పాటు చేశారు. సంబంధిత పోలింగ్‌ కేంద్రం నెంబరు, కేంద్రం పేరు, పోలింగ్‌ కేంద్రం స్థాయి అధికారిణి(బి.ఎల్‌.ఒ.), సెక్టార్‌ అధికారి, పోలీసు అధికారి, సహాయ రిటర్నింగ్‌ అధికారి(జిల్లా అదనపు పాలనాధికారి), రిటర్నింగ్‌ అధికారి(జిల్లా పాలనాధికారి) పేరు వివరాలు, చరవాణి నెంబర్లతో పాటు కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 1950 తదితర వివరాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గోదావరిఖనిలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాలకు పోలీసు అధికారిగా గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి కాగా ఆయన హోదాను ఫ్లెక్సీల్లో ఎస్సైగా పేర్కొనడంతో పాటు కొన్ని కేంద్రాల జాబితాలో పోలింగ్‌ కేంద్రం ప్రాంతం జనగామ, గోదావరిఖనికి బదులుగా జంగం(బిదీరీ)గా పేర్కొనడం గమనార్హం.

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని