logo

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి మూడు ఏసీలు

కరీంనగర్‌ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్‌ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’,

Published : 03 May 2024 03:26 IST

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్‌ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, ఏప్రిల్‌ 30న ‘ఐసీయూలో పనిచేయని ఏసీలు’ శీర్షికలతో కథనాలు ప్రచురితమయ్యాయి. ఆసుపత్రికి అవసరమైన కూలర్లు, ఏసీల వివరాలు సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వీరారెడ్డిని కలెక్టర్‌ ఆదేశించారు. వైద్యాధికారుల నివేదిక మేరకు కలెక్టర్‌ ఏసీలు మంజూరు చేశారు. ఐసీయూలో ఉన్న ఆరు ఏసీల మరమ్మతుకు రూ.50 వేలు చెల్లించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని