logo

‘చక్కెర పరిశ్రమపై కాంగ్రెస్‌ డ్రామా’

చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్‌ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 04 May 2024 04:45 IST

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్‌ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పరిశ్రమలు తెరవాలంటే సుమారు రూ.700 నుంచి రూ.800 కోట్లు అవసరమని పేర్కొన్నారు. కేవలం ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రైతులను మోసం చేసేందుకు రూ.43 కోట్లు ముఖ్యమంత్రి విడుదల చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే నాలుగు బ్యాంకులకు రూ.202 కోట్లు, ప్రైవేటు వ్యక్తికి రూ.262 కోట్లు ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. విద్యుత్తు బాకాయిలు రూ.15 కోట్లు, యంత్రాలకు రూ.50 కోట్లు అవసరమన్నారు. పరిశ్రమ నడవాలంటే కనీసం 10 శాతమైనా ఈ ప్రాంతంలో చెరకు ఉండాలన్నారు. అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్‌కులాచారి, మోహన్‌రెడ్డి, న్యాలం రాజు, మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, గద్దెభూమన్న, స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.

హామీలను నమ్మి మోసపోవద్దు

మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం: ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని నిజామాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ అన్నారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో శుక్రవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వాల పనితీరు గమనించి ఓటు వేయాలన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. 75 ఏళ్ల నుంచి గుర్తు రాని గల్ఫ్‌ బోర్డు కాంగ్రెస్‌కు ఇప్పుడే గుర్తొచ్చిందని, భాజపా గల్ఫ్‌ దేశాల్లో ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరం ఏర్పాటు చేసి ఆరోగ్య, న్యాయ సేవలు అందిస్తుందన్నారు. అవినీతి లేని పాలన భాజపాతోనే సాధ్యమని, ఈ ఎన్నికల్లో భాజపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని