logo

ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య

ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి

Published : 18 May 2024 06:23 IST

అన్నదమ్ముల కుమారులు మృత్యువాత

 శ్రీనివాస్‌                            మహేశ్‌

 బుగ్గారం, న్యూస్‌టుడే: ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. బుగ్గారం ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి కథనం మేరకు.. గోపులాపూర్‌కు చెందిన దీటి శ్రీనివాస్‌ రెండేళ్ల క్రితం తన ఇంటి పక్కనే మరో ఇంటిని కొనుగోలు చేశాడు. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన బుర్ర నవీన్‌ ఇల్లు ఉంది. ఇంటి కొనుగోలు, రహదారి విషయంలో నవీన్‌కు శ్రీనివాస్‌కు తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం రాత్రి కూడా శ్రీనివాస్‌, నవీన్‌ కుటుంబాల మధ్య గొడవ జరిగి సద్దుమణిగింది. అనంతరం శ్రీనివాస్‌ పెద్దనాన్న కొడుకైన దీటి మహేశ్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడికి నవీన్‌ కొంతమంది యువకులతో కలిసి వచ్చి శ్రీనివాస్‌(36)పై కర్రలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహేశ్‌(38)పై కూడా దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్‌ తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మహేశ్‌ ఉపాధి కోసం ముంబయి వెళ్లి రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్‌కు వివాహమైంది. శ్రీనివాస్‌ సోదరి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపాడు. సంఘటన స్థలాన్ని అదనపు ఎస్పీ వినోద్‌కుమార్‌ పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని