logo
Published : 28/11/2021 00:54 IST

పర్యావరణ రక్షణకే పెద్దపీట

జ్యోతి వెలిగిస్తున్న శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పెద్ద పీట వేయాలని జీవనకళ ఆశ్రమం (ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌) వ్యవస్థాపకుడు రవిశంకర్‌ గురూజీ పిలుపునిచ్చారు. బెంగళూరు అంతర్జాతీయ వస్తు ప్రదర్శన కేంద్రంలో ఏర్పాటు చేసిన పర్యావరణహిత వాహనాల ప్రదర్శన గ్రీన్‌ఎక్స్‌పోను స్వామీజీ శనివారం ప్రారంభించి మాట్లాడారు. పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వనరులను ఇష్టం వచ్చినట్లు వినియోగించడం మంచిది కాదన్నారు. కర్బన ఉద్గారాలు లేని వాహనాల వినియోగంతో పర్యావరణానికి మేలు చేయవచ్చని అన్నారు. గ్రీన్‌ ఎక్స్‌పోలో పొగరాని బ్యాటరీ కారు, బైకు, ప్యాసింజర్‌ ఆటో, లగేజ్‌ ఆటో, చెత్తను తరలించే వాహనాలను ప్రదర్శించారు. సోమవారం సాయంత్రం వరకు ప్రదర్శన కొనసాగనుంది.
Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని