logo
Updated : 02/12/2021 08:22 IST

Crime News: ప్రియురాలు బ్యాంక్‌ క్యాషియర్‌.. ప్రియుడు ఏటీఎం దొంగ!

విజయపుర, న్యూస్‌టుడే: ఏటీఎం దోచుకున్న కిలాడీ ప్రేమికుల దోపిడీ బాగోతం ఆలస్యంగా వెలుగు చూసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు క్యాషియర్‌ తన ప్రియుడికి దోపిడీలో సహకరించింది. ఈ నేరానికి కారణమైన నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి దోపిడీకి గురైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. విజయపుర జిల్లా ముద్దేబిహాళ్‌ పట్టణంలోని హడ్కో కాలనీలో యూనియన్‌ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో సెప్టెంబరు 18న రాత్రి దోపిడీ జరిగింది. అందులోని రూ.16 లక్షల నగదు మాయమైంది. నిందితులు ఏటీఎంను ఏమాత్రం ధ్వంసం చేయకుండా దర్జాగా తాళాన్ని తీసి నగదును దోచుకున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు తమ ఆచూకీ ఎక్కడా బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దర్యాప్తును చేపట్టిన పోలీసులకు కేసు పరిష్కారం ఓ సవాల్‌గా మారింది. అక్కడి నిత్యధన కేంద్రంలో నిఘా కెమెరాలు లేనందున నిందితుల గురించిన ఏ చిన్న క్లూ కూడా లభించలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఓ సవాల్‌గా దర్యాప్తును చేపట్టిన పోలీసులు ముందుగా దోపిడీ జరిగిన రోజున రాత్రి ముద్దేబిహాళ్‌ పట్టణంలోని ఇతర ప్రాంతాల్లోని నిఘా కెమెరాల్లోని దృశ్యాలను విశ్లేషించారు. ఒక్కో కెమెరాలోని దృశ్యాల్ని పరిశీలిస్తుండగా అన్ని కెమెరాల్లో కూడా ఓ కారు, అందులో నలుగురు వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తునట్లు గుర్తించారు. అందులోని వ్యక్తులను అరెస్టు చేయడంతో దోపిడీ వ్యూహం వెలుగు చూసింది. నిందితుల్లో ఒకడైన మంజునాథ్‌ అనే వ్యక్తిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు క్యాషియర్‌ మస్మితా, మంజునాథ్‌ ప్రేమికులని తెలిసింది. తన ప్రియుడికి ఆమె నిత్యధన కేంద్రం పాస్‌ వర్డ్‌ను చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. ఈ సంఘటనలో బ్యాంకు సెక్యూరిటీ గార్డు కూడా సహకరించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. మంజునాథ్‌ను, అతనికి సహకరించిన నలుగురు స్నేహితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని