logo

సాధనతో సమున్నత ఫలితాలు

ఆధునిక సమాజంలో బాలికలు అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తున్నారని జాతీయ ఆరోగ్య మిషన్‌ సంచాలకురాలు డాక్టర్‌ అరుంధతి చంద్రశేఖర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ఆ

Published : 25 Jan 2022 04:37 IST


ఆరోగ్య సౌధలో డాక్టర్‌ అరుంధతి చంద్రశేఖర్‌ నేతృత్వంలో గాలిబుడగలను ఎగురవేస్తున్న అధికారులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఆధునిక సమాజంలో బాలికలు అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తున్నారని జాతీయ ఆరోగ్య మిషన్‌ సంచాలకురాలు డాక్టర్‌ అరుంధతి చంద్రశేఖర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ఆరోగ్యసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాటి మహిళ ఉద్యోగులు అధికారులతో కలిసి కేకు కోశారు. అనంతరం గులాబీ రంగు బెలూన్లను గాలిలో ఎగురవేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు ఎందులోనూ తీసిపోరని, అన్నింట్లో బాలలతో పోటీ పడుతున్నారని తెలిపారు. కరోనా నియంత్రణలో మహిళల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. మహిళలు చదువుకుంటే సమున్నత ఫలితాల శిఖరాలు చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కేఎస్‌ఏపీఎస్‌ సంచాలకురాలు లీలావతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని