logo

శతక్కొట్టిన టమోటా

ఉద్యాననగరిలో టమోటా ధరలు సెంచెరీ దాటాయి. వ్యాపారులు టోకున రూ.100కు, చిల్లరగా రూ.110కి విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్ని కూరగాయల ధరలూ చుక్కల్ని తాకుతున్నాయి. సామాన్యుల జేబులకు కత్తెర వేస్తున్నాయి.

Published : 24 May 2022 02:28 IST

ఏ కూరగాయను ముట్టుకున్నా ధరల మంటే

బెంగళూరు గ్రామీణం, యశ్వంతపుర, న్యూస్‌టుడే : ఉద్యాననగరిలో టమోటా ధరలు సెంచెరీ దాటాయి. వ్యాపారులు టోకున రూ.100కు, చిల్లరగా రూ.110కి విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్ని కూరగాయల ధరలూ చుక్కల్ని తాకుతున్నాయి. సామాన్యుల జేబులకు కత్తెర వేస్తున్నాయి. పది రోజుల కిందటే బెంగళూరులో ఇదే టమోటా రూ.12 ఉండగా.. నిత్యం దాని ధర పెరుగుతూ శతాధికంగా నమోదయ్యింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద టామోటా మార్కెట్‌గా గుర్తింపు ఉన్న కోలారు ఏపీఎంసీ మార్కెట్‌లో 15 కిలోల తూకం ఉన్న బాక్సు ధర రూ.1000 దాటింది. కోలారు నుంచి ఇతర ప్రాంతాలకు టమోటా ఎగుమతి అవుతుండడంతో మదనపల్లి మార్కెట్‌ నుంచి నగరానికి టమోటా వస్తోంది. గత ఏడాదిన్నరగా నష్టాలు ఎదుర్కొంటున్న టమోటా సాగు రైతులకు ఈసారి బంపర్‌ ధర వచ్చింది. ఫారం బఠానీలు కిలో రూ.180, బీన్స్‌ రూ.110, బీరకాయ రూ.70 ఉండగా, వంకాయ, బీట్‌ రూట్‌, పొట్లకాయ, దోసకాయ తదితరాల ధరలు రూ.60 వరకు పలుకుతున్నాయి. ఉల్లిపాయ ఆరు కిలోలు రూ.100కే అందుబాటులోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని