logo

డిజిటల్‌ యోగా.. ప్రదర్శన అదిరెనుగా..!

డిజిటల్‌ యోగా కేంద్రం ప్రదర్శన ఆదివారం ముగిసింది. నిత్యం వేలాది మందిని ఆకర్షిస్తూ వచ్చిన ఈ కేంద్రానికి అనూహ్య స్పందన లభించడం పట్ల ఆయుష్‌ అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాచనగరికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగా ప్రదర్శన అనంతరం ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈ డిజిటల్‌ యోగా కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Published : 27 Jun 2022 02:47 IST

ఎగ్జిబిషన్‌ మైదానంలోని డిజిటల్‌ యోగా కేంద్రం
 

మైసూరు, న్యూస్‌టుడే: డిజిటల్‌ యోగా కేంద్రం ప్రదర్శన ఆదివారం ముగిసింది. నిత్యం వేలాది మందిని ఆకర్షిస్తూ వచ్చిన ఈ కేంద్రానికి అనూహ్య స్పందన లభించడం పట్ల ఆయుష్‌ అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాచనగరికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగా ప్రదర్శన అనంతరం ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈ డిజిటల్‌ యోగా కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలుత దీన్ని రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయాలని అనుకున్నా తొలి రోజు నుంచి లభించిన స్పందన నేపథ్యంలో 26 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థులు, వృద్ధులతో పాటు అన్ని వయస్సుల ప్రజలూ ప్రదర్శనను వీక్షించారన్నారు. ఆరోగ్య సంరక్షణకు యోగా ఎలా ఉపయోగపడుతుంది? శరీర బరువుకు తగిన యోగాసనాలు? బరువును ఏవిధంగా తగ్గించుకోవాలి? తదితర అంశాల్ని సులువుగా తెలుసుకునేలా డిజిటల్‌ ఏర్పాట్లున్నాయి. యోగాకు సంబంధించిన అంకుర పరిశ్రమలతో పాటు దాదాపు 146 స్టాళ్లను ఏర్పాటు చేశారు. యోగా రాజధానిగా గుర్తింపు పొందిన మైసూరు నగరం పర్యాటకంగా దేశ విదేశీ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఈ మ్యూజియంను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.

ప్రదర్శనను తిలకించేందుకు బారులు తీరిన ఔత్సాహికులు
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని