logo

భక్తిప్రపత్తులతో మొహర్రం

మహ్మద్‌ ప్రవక్త మనవడు హజరత్‌ ఇమాం హుస్సేన్‌ త్యాగానికి గుర్తుగా ‘మొహర్రం’ను ముస్లిం సోదరులు ఆచరించారు. పది రోజుల నుంచి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకున్న భక్తులు చివరి రోజైన మంగళవారం పీర్లు ఊరేగించారు. కొన్ని చోట్ల

Published : 10 Aug 2022 02:40 IST

తమను తాము హింసించుకుంటున్న భక్తులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : మహ్మద్‌ ప్రవక్త మనవడు హజరత్‌ ఇమాం హుస్సేన్‌ త్యాగానికి గుర్తుగా ‘మొహర్రం’ను ముస్లిం సోదరులు ఆచరించారు. పది రోజుల నుంచి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకున్న భక్తులు చివరి రోజైన మంగళవారం పీర్లు ఊరేగించారు. కొన్ని చోట్ల గొలుసుకు కట్టిన మెనదేలిన బ్లేడులతో వీపుపై కొట్టుకుని తమను తాము హింసించుకుని భక్తి చాటుకున్నారు. మరికొన్ని చోట్ల ఛాతీపై కొట్టుకుంటూ రోదించి, ఇమాం హుసేస్‌ త్యాగాన్ని స్మరించుకున్నారు. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం మొహర్రం వారికి మొదటి మాసం. ఈ నెల ఒకటో తేదీన ఇరాక్‌లోని కర్బలా మైదానంలో అక్కడి రాజు యజీద్‌ సైన్యం ఇమాం హుస్సేన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను హింసించి హత్య చేసిందనేది చరిత్ర. హత్యాననంతరం వారు తాము చేసిన తప్పును తెలుసుకుని ఇలా హింసించుకుని, బాధ పడడం సంప్రదాయకంగా వస్తోంది. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా మొహర్రం ఆచరిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తును కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని