logo

విధానసౌధ ముట్టడి భగ్నం

దీర్ఘకాలంగా పేరుకుపోయిన తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రైతులు ఉద్యమ గళం పెంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు ఖండిస్తూ జాతీయ రైతు సంఘాల సమాఖ్య నేతృత్వంలో సోమవారం బెంగళూరులోని విధానసౌధ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. రైతు సంఘాల

Published : 27 Sep 2022 01:07 IST

బెంగళూరు వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తున్న రైతు సంఘం నాయకులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : దీర్ఘకాలంగా పేరుకుపోయిన తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రైతులు ఉద్యమ గళం పెంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు ఖండిస్తూ జాతీయ రైతు సంఘాల సమాఖ్య నేతృత్వంలో సోమవారం బెంగళూరులోని విధానసౌధ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. రైతు సంఘాల నేతలను అరెస్టు చేశారు. ఉద్యమానికి సంఘీభావంగా కదలివచ్చిన దక్షిణ భారత రైతు సమాఖ్య నాయకులు కోటపాటి నరసింహం నాయుడు, నల్లమల్ల వెంకటేశ్వరరావు, పీకే దేవసిగామని, ఎం.రామగౌండర్‌, శాంతకుమార్‌, శివకుమార్‌ కక్కాజి, దల్లేవాల్‌ తదితరులు మాట్లాడుతూ రైతులపై ప్రభుత్వాలకు కరుణ లేకుండా పోయిందన్నారు. రైతులపై బనాయించిన కేసులు రద్దు చేయాలని డిమాండు చేశారు. విద్యుత్తు సవరణ ముసాయిదాను ఉపసంహరించుకోవాలని, ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి వైదొలగాలని, వ్యవసాయోత్పత్తులు, యంత్ర పరికరాలపై విధించిన జీఎస్‌టీ ఎత్తివేయాలని రైతులు ఉద్యమించారు. సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరిన రైతులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ముందుకు అడుగేయకుండా కొందరిని అదుపులోకి తీసుకుని తరలించారు. అతివృష్టి వల్ల పంట నష్టం, మూడున్నర లక్షలమంది అన్నదాతల ఆత్మహత్యల నేపథ్యంలో ఆయా కుటుంబాలకు సాయం చేయాలంటూ నినదించారు. దేశవ్యాప్తంగా రైతుల రుణాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటానికి దిగినట్లు రైతు సంఘం నేత కురుబూరు శాంతకుమార్‌ తెలిపారు.

పోలీసు వాహనం నుంచి నినాదం చేస్తున్న ఓ నాయకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని