logo

నాజూకు ప్రయాణానికి నిచ్చెనలు

నమ్మ మెట్రో రైల్లో ఒక టి·కెట్‌ కొనుగోలు చేసి.. ఆరుగురు ప్రయాణించే వ్యవస్థ డిసెంబరు నుంచి అమలులోకి రానుంది.

Published : 27 Nov 2022 01:38 IST

మెట్రో రైల్లో నిత్యం ప్రయాణికుల రద్దీ

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : నమ్మ మెట్రో రైల్లో ఒక టి·కెట్‌ కొనుగోలు చేసి.. ఆరుగురు ప్రయాణించే వ్యవస్థ డిసెంబరు నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం ఒక కుటుంబంలో నలుగురు రైల్లో సంచరించినా.. నాలుగు టిక్కెట్లు కొనుగోలు చేయాల్సిందే. ఒకే టికెట్‌గా విచ్చే వ్యవస్థ లేదు. దీని వల్ల సమయం వృథా అవుతుందని అధికారులు గుర్తించారు. సమస్యను పరిష్కరించేందుకు వీలుగా కొత్త విధానాన్ని అమలులోకి తేవాలని భావిస్తున్నారు. అందరూ కలిసి అవసరమైన మొత్తాన్ని చెల్లించి గమ్యస్థానం చేరడానికి ఒకేటికెట్‌ పొందవచ్చు. ఒక టికెట్‌పై గరిష్ఠంగా ఆరుగురు సంచరించే వీలుంటుందని బీఎంఆర్‌సీఎల్‌ ఎండీ అంజుం పర్వేజ్‌ తెలిపారు. ఈ నెల ఒకటి నుంచి చరవాణి ద్వారా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి నిర్ణీత ప్రదేశానికి ప్రయాణం ఛార్జీ చెల్లించే వ్యవస్థను అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం నిత్యం క్యూఆర్‌ కోడ్‌ను వినియోగించి 1.38 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు ఆ అధికరి తెలిపారు. నాజూకు కార్డు ఉపయోగించి లక్ష మంది తిరుగుతున్నట్లు వివరించారు. మిగతా ప్రయాణికులు కాయిన్‌ కొనుగోలు చేసి సేవలు పొందుతున్నారు. క్యూఆర్‌ కోడ్‌ విధానం అమలులోకి వచ్చిన తరువాత టిక్కెట్‌ కౌంటర్ల వద్ద నిలబడే ప్రయాణికుల సంఖ్య తగ్గింది. కొత్త విధానం అమలులోకి వస్తే ఈ సమస్య మరింత తగ్గిపోనుందని అంజుం పర్వేజ్‌ తెలిపారు. ఆయా మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు బీఎంటీసీ బస్సులను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. కొత్తగా ప్రారంభం కానున్న బయ్యప్పనహళ్లి- వైట్‌ఫీల్డ్‌ మార్గంలో బీఎంటీసీ బస్సు వ్యవస్థను కొన్ని అపార్ట్‌మెంట్‌ల వరకు ప్రవేశపెట్టనున్నారు.

టిక్కెట్‌ కోసం బారులు తీరిన జనం

క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానం సఫలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని