logo

ప్రతిభను ప్రోత్సహించండి

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగు తీయడానికి ఇలాంటి వేదికలు దోహదపడతాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు పిలుపునిచ్చారు.

Published : 02 Dec 2022 01:22 IST

ప్రతిభా కారంజీ పోటీలను ప్రారంభిస్తున్న మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, చిత్రంలో మంత్రి బి.శ్రీరాములు, లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగు తీయడానికి ఇలాంటి వేదికలు దోహదపడతాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ, ఎస్‌.కె.మోదీ నేషనల్‌ పాఠశాల సంయుక్తంగా గురువారం పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి ప్రతిభా కారంజీ పోటీలను రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్యమంత్రి బి.శ్రీరాములు, మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, జిల్లా విద్యాశాఖాధికారి అందానప్ప వడగేరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిభ ఒకరి సొత్తు కాదు...ప్రతిభావంత విద్యార్థులను గుర్తించి భుజం తట్టి ప్రోత్సహిస్తే రాణించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. కొవిడ్‌తో రెండేళ్లగా విద్యార్థులు ఇలాంటి ప్రతిభా కారంజీ వంటి కార్యక్రమాలకు దూరమయ్యారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గెలుపొంది, బళ్లారికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకునిరావాలని కోరారు. శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప మాట్లాడారు. అనంతరం విద్యార్థులు కూచిపూడి, భారతనాట్యం, జానపద, వీరగాసి, కోలాటం, చిత్రలేఖనం, ఏకపాత్రాభినయం, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్‌ గోనాళు రాజశేఖర్‌గౌడ, క్షేత్ర విద్యాశాఖాధికారులు వెంకటేశ్‌ రామచంద్రప్ప, నింగప్ప, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.

వేషధారణలో ఉన్న విద్యార్థులతో మేయర్‌

డోలు కుణతలో విద్యార్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని