‘కొత్త పద్ధతిని విరమించుకోండి’
సింధనూరు ఉప విభాగం పరిధిలో నీటిపారుదల అధికారులు కొత్తగా ప్రవేశపెట్టాలని భావించిన ఉప కాలువల ‘ఆన్ అండ్ హాఫ్’ పద్ధతిని తక్షణం విరమించుకోవాలని, లేకుంటే విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రాంత రైతు సంఘం నాయకులు అధికారులను హెచ్చరించారు.
నీటిపారుదల అధికారులకు వినతిపత్రం అందిస్తున్న రైతుసంఘం నాయకుడు కరుటూరి వెంకణ్ణ
సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు ఉప విభాగం పరిధిలో నీటిపారుదల అధికారులు కొత్తగా ప్రవేశపెట్టాలని భావించిన ఉప కాలువల ‘ఆన్ అండ్ హాఫ్’ పద్ధతిని తక్షణం విరమించుకోవాలని, లేకుంటే విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రాంత రైతు సంఘం నాయకులు అధికారులను హెచ్చరించారు. ఈ విషయమై రెండు రోజులుగా స్థానిక మినీ విధానసౌధ ఎదుట ధర్నా జరిపిన రైతు సంఘం నాయకులు శనివారం సాయంత్రం నీటిపారుదల అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఎడమ ప్రధాన కాలువ మైలు 47 నుంచి 69 వరకూ (సింధనూరు ఉప విభాగం) అన్ని ఉప కాలువలకు వంతుల ప్రకారం నీటిని అందించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో లవెల్లడించారు. దానిని తక్షణం ఉపసంహరించుకోవాలని రైతులు పట్టుబట్టారు. రెండో పంటకు అసలే నీరు అంతంతమాత్రంగా అందుతున్నాయి. సాగునీరు సవ్యంగా అందక కొన్ని వరిచేలు ఎండిపోతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా వంతులు వారీ నీటి విడుదల పద్ధతి.. రైతును నట్టేట ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాట రైతుల తరఫున సంఘం నాయకుడు కరుటూరి వెంకణ్ణ అధికారులకు వినతిపత్రం అందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని