logo

ఆరోగ్య అమృత అభియాన్‌పై అవగాహన కల్పించాలి

ప్రతి గ్రామపంచాయతీ వ్యాప్తిలో ఆరోగ్య అమృత అభియాన్‌ కింద అంటువ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి శరణ బసవరాజ సూచించారు.

Published : 04 Feb 2023 01:39 IST

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న శరణబసవరాజ, డి.హెచ్‌.వో డా.జనార్దన్‌, చంద్రశేఖర్‌గుడి, తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రతి గ్రామపంచాయతీ వ్యాప్తిలో ఆరోగ్య అమృత అభియాన్‌ కింద అంటువ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి శరణ బసవరాజ సూచించారు. జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా మహిళా-శిశు అభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్‌శాఖ సంయుక్తంగా శుక్రవారం జిల్లా పంచాయతీ నజీర్‌ సభాభవనంలో ఆరోగ్య అమృత పథకంపై అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామ పంచాయతీలకు విడుదల అవుతున్న వివిధ పథకాలతో పాటు, ఆరోగ్య అమృత పథకం కింద అంటువ్యాధుల నిర్వహణలో భాగంగా గ్రామాల స్వచ్ఛత, వ్యక్తిగత స్వచ్ఛతపై అవగాహన కల్పించాలన్నారు. క్షయవ్యాధి రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని కోరారు. రక్తహీనత, అపౌష్టికత, మానసిక ఆరోగ్యం, తదితర వాటిపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారి డా.హెచ్‌.ఎల్‌.జనార్దన్‌ వివిధ పథకాల గురించి వివరించారు. ముఖ్య యోజనాధికారి చంద్రశేఖర్‌గుడి, అధికారులు లక్ష్మణ శృంగేరి, మోహినుద్ధీన్‌, జిల్లా మహిళా-శిశు అభివృద్ధిశాఖాధికారి విజయకుమార్‌, అధికారులు పంపాపతి, శ్రీకుమార, డా.మోహన్‌కుమారి, డా.కోట్రేష్‌, డా.జబీన్‌ తాజ్‌, రామకృష్ణనాయక పాల్గొన్నారు.

గంగావతి,న్యూస్‌టుడే: ఆరోగ్య అమృత అభియాన్‌ను జయప్రదం చేయాలని జడ్పీ సీఈవో ఫౌజియా తరున్నమ్‌ కోరారు. ఈ అభియాన్‌కు రాష్ట్రంలో ఎంపికైన 14 జిల్లాల్లో కొప్పళ ఒకటన్నారు. శుక్రవారం పంచాయతీ ఈవోలకు కిట్లు పంపిణీ చేసి ఆమె మాట్లాడారు. జిల్లాలో పలు గ్రామ పంచాయితీలను ఎంపిక చేసిటన్లు చెప్పారు. వ్యక్తిగత, సముదాయ మరుగుదొడ్లు, ఘనవ్యర్థాల నిర్వహణను చేపట్టాలన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, రక్తహీనత, పౌష్ఠికాహారంపై దృష్టి పెట్టాలన్నారు. పంచాయితీ స్థాయిలో ఎంపికైన టాస్క్‌పోర్స్‌కు ఎనిమిది పరికరాల కిట్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. క్షయ, అంటువ్యాధుల గుర్తింపు, టీకా అభియాన్‌లు చేపట్టాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉప కార్యదర్శి సమీర్‌ ముల్లా, ఆరోగ్యశాఖ అధికారి అలకానంద, మహిళా శిశుసంక్షేమశాఖ అధికారి జి.పద్మావతి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని