logo

బొమ్మైకి దిల్లీ పిలుపు

తమతో భేటీ కావాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కబురు పంపించారు. సెక్స్‌ స్కాండల్‌ సీడీ కేసు అంశంపై మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి ఇప్పటికే షాను కలుసుకుని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై ఫిర్యాదు చేశారు

Published : 05 Feb 2023 06:52 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : తమతో భేటీ కావాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కబురు పంపించారు. సెక్స్‌ స్కాండల్‌ సీడీ కేసు అంశంపై మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి ఇప్పటికే షాను కలుసుకుని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై ఫిర్యాదు చేశారు. తనను పావుగా చేసి, సీడీని తయారు చేయించేందుకు డీకే రూ.40 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే అన్ని వాస్తవాలూ వెలుగులోకి వస్తాయని షాకు విన్నవించారు. ఈ అంశాన్ని తనకు అనువుగా మలుచుకునేందుకు కమలనాథులు వ్యూహాలకు తెరతీశారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి శివకుమార్‌ను కట్టడి చేయాలని యోచిస్తున్నారనేది కాంగ్రెస్‌ నేతల అనుమానం. షా సూచనకు అనుగుణంగా ఆదివారమే బొమ్మై హస్తినకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని కర్ణాటకకు సోమవారం వస్తుండగా, షా ఆపై శనివారం రానున్నారు. ఇప్పటికే ప్రజాధ్వని పేరిట బస్సు యాత్రలతో ప్రజలలోకి వెళుతున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులను కొంత వరకు కట్టడి చేస్తేనే తమ విజయావకాశాలు మరింత మెరుగు అవుతాయని కమలనాథులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని