logo

సుమలత ప్రచారం రద్దు

మండ్యలో జనతాదళ్‌, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి మద్దతుగా లోక్‌సభ సభ్యురాలు సుమలత అంబరీశ్‌ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది.

Published : 25 Apr 2024 01:34 IST

కరవైన అధిష్ఠానం సూచనలు

మండ్య, న్యూస్‌టుడే : మండ్యలో జనతాదళ్‌, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి మద్దతుగా లోక్‌సభ సభ్యురాలు సుమలత అంబరీశ్‌ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. భాజపా నాయకత్వం సూచిస్తే ప్రచారానికి వెళతానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో బుధవారం నాటి తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నానని చెప్పారు. మండ్యకు రాకుండా బెంగళూరులోనే ఉండిపోయారు. బుధవారం సాయంత్రం బహిరంగ ప్రచారానికి తెరపడింది. గురువారం ఇంటింటి ప్రచారాన్ని చేసేందుకు వెళ్లే అవకాశాలూ మృగ్యమే. గత ఎన్నికల్లో కుమారస్వామి తనయుడు నిఖిల్‌పై మండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సుమలత ఇటీవలే భాజపాలో చేరారు. మరోసారి అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆమె చివరి క్షణం వరకు విఫలయత్నాలు చేశారు. పార్టీ ఆదేశిస్తే కుమార తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. ఆమె సేవలను అటు భాజపా.. ఇటు కుమారస్వామి వినియోగించుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని