logo

ఉమేశ్‌రెడ్డిని మించిన కీచకుడు ప్రజ్వల్‌ రేవణ్ణ

సైకో కిల్లర్‌ ఉమేశ్‌రెడ్డిని మించిన కీచకుడు హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అని కాంగ్రెస్‌ మహిళా విభాగం రాష్ట్రాధ్యక్షురాలు పుష్పా అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Published : 05 May 2024 04:19 IST

ఉరితీసినా పాపం లేదు - పుష్పా అమర్‌నాథ్‌

ప్రధాని మోదీ, దేవేగౌడ కుటుంబ సభ్యులు కలిసి తీసుకున్న ఫొటోను ప్రదర్శిస్తున్న రాష్ట్రాధ్యక్షురాలు పుష్పా అమర్‌నాథ్‌

హొసపేటె, న్యూస్‌టడే: సైకో కిల్లర్‌ ఉమేశ్‌రెడ్డిని మించిన కీచకుడు హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అని కాంగ్రెస్‌ మహిళా విభాగం రాష్ట్రాధ్యక్షురాలు పుష్పా అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. అతన్ని ఉరితీసినా పాపం లేదని శాపనార్థాలు పెట్టారు. శుక్రవారం స్థానిక శాసనసభ్యుడు హెచ్‌.ఆర్‌.గవియప్పతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అతని కీచకత్వం బయట పడగానే విదేశాలకు ఎగిరిపోయాడు. అతను విదేశాలకు వెళ్లటానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందని ఆరోపించారు. ప్రధాని మోదీకి మహిళలపై నిజమైన గౌరవం ఉంటే, వెంటనే అతని పాస్‌పోర్టు రద్దుచేసి స్వదేశానికి రప్పించాలని పేర్కొన్నారు. ప్రజ్వల్‌ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది, సీబీఐ విచారణకు అప్పగించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే అదే పదివేలు అని దెప్పిపొడిచారు. కీచక నేపథ్యం ఉన్న ప్రజ్వల్‌కు టికెట్‌ ఇవ్వడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసుపై భాజపాలోని మహిళా నాయకులు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. రేవణ్ణ నుంచి బాధిత మహిళలకు న్యాయం చేకూర్చే వరకు తాను పోరాటం చేస్తానని హెచ్చరించారు. రేవణ్ణ అభ్యర్థిత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యక్షురాలు జయలక్ష్మీ పుత్రన్‌, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని