logo

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

గౌతమీనగర్‌లోని ప్రతిష్ఠాత్మక భారజల ప్లాంటు ఈసీసీ స్టోర్స్‌ లిమిటెడ్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. 16, 17, 18 తేదీల్లో ఈసీసీ స్టోర్స్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో

Published : 19 May 2022 05:57 IST

అశ్వాపురం, న్యూస్‌టుడే: గౌతమీనగర్‌లోని ప్రతిష్ఠాత్మక భారజల ప్లాంటు ఈసీసీ స్టోర్స్‌ లిమిటెడ్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. 16, 17, 18 తేదీల్లో ఈసీసీ స్టోర్స్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో నామినేషన్‌లను స్వీకరించారు. మొత్తం 6 డైరెక్టర్ల స్థానాలకు 19 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి, జిల్లా అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ లక్ష్మీహరిత తెలిపారు. ఆరు డైరెక్టర్ల స్థానాల్లో మూడు అన్‌రిజర్వ్‌డ్‌ స్థానాలకు 12, ఒక ఎస్సీ, ఎస్టీ స్థానానికి 3, రెండు మహిళల స్థానాలకు 4 వెరసి 19 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు. 19న స్క్రూటినీ జరుగనుంది. 20న నామినేషన్‌ పత్రాల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా వెల్లడి ఉంటాయి. 26న గౌతమీనగర్‌లోని తరంగిణి ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి ఉంటాయి. 27న ఆఫీసు బేరర్ల ఎన్నిక జరుగుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని