logo

భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర

జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ  ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు.

Published : 27 Apr 2024 02:28 IST

లక్ష్మీదేవిపల్లి: ప్రచారంలో భాగంగా బజ్జీలు వేస్తున్న తాండ్ర

కొత్తగూడెం గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ  ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. రైతు రుణమాఫీ, పింఛన్‌ పెంపు వంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు మాటమారుస్తోందన్నారు. ఆపార్టీలో దిల్లీ నుంచి ఖమ్మం వరకు అంతా కుటుంబ పాలనే నడుస్తోందని దుయ్యబట్టారు. తనకు ఓటేస్తే నరేంద్ర మోదీకి వేసినట్లేనని పేర్కొన్నారు. ఖమ్మం స్థానంలో లోకల్‌, నాన్‌ లోకల్‌కు మధ్య  ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ర్యాలీలో భాజపా జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్‌, ప్రధాన కార్యదర్శి చింతలచెరువు   శ్రీనివాస్‌, ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ బాధ్యుడు బైరెడ్డి  ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, రాయుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని