logo

66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ

లోక్‌సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.

Published : 27 Apr 2024 02:09 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు. ఖమ్మంలో భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామపత్రాల పరిశీలన సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున హాజరైన న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భారాస అభ్యర్థి పూర్తి కేసుల వివరాలు పేర్కొనలేదని ఆయన నామినేషన్‌ తిరస్కరించాలని కోరగా నామా తరఫున హాజరైన న్యాయవాదులు వ్యతిరేకించారు. తమ అభ్యర్థిపై నమోదైన అన్ని కేసుల వివరాలను ప్రస్తావించామన్నారు. పరిశీలించిన ఎన్నికల అధికారులు నామా నాగేశ్వరరావు నామినేషన్‌ చెల్లుబాటు అవుతుందని ప్రకటించారు. పార్టీ ముఖ్యనేతల సూచనల మేరకు తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు కాంగ్రెస్‌ నేత నాగసీతారాములు తెలిపారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో నాగసీతారాములు, రాయల నాగేశ్వరరావు, గుజ్జుల వేణుగోపాల్‌రెడ్డి, శెట్టిపల్లి శ్రీను నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని