logo

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన: నిర్మల్‌సింగ్‌

దిల్లీ మద్యం కేసు నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత తప్పించుకోలేర]ని జమ్ముకశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్‌ పేర్కొన్నారు.

Published : 02 Jun 2023 04:08 IST

ఖమ్మంలో మాట్లాడుతున్న జమ్ముకశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్‌, చిత్రంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: దిల్లీ మద్యం కేసు నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత తప్పించుకోలేర]ని జమ్ముకశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రధానమంత్రి సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఖమ్మం వచ్చిన ఆయన విలేకరులతో గురువారం మాట్లాడారు.సీబీఐ తాజా అభియోగపత్రంలో కవిత పేరు ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన ఎంతోకాలం సాగదని జోస్యం చెప్పారు. ప్రధాని  మోదీ తన తొమ్మిదేళ్ల పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేశారని, వాటిని ప్రజలకు వివరించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఖమ్మం చుట్టూ రూ.12వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, జాతీయ మార్కెట్లతో ఖమ్మాన్ని అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెండింతలు చేసేందుకు ప్రధాని యత్నిస్తున్నారని  చెప్పారు. కిసాన్‌ సమ్మాన్‌ యోజన, పీఎం ఆవాస్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాల పేర్లు మార్చి కేసీఆర్‌.. తెలంగాణలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లి భారత్‌  వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లాగానే కశ్మీర్‌ ఉందని, జీ-20 సదస్సు నిర్వహించుకున్నామన్నారు. 370 అధికరణం తొలగించిన తర్వాత కశ్మీర్‌లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రమేశ్‌, విద్యాసాగర్‌, రుద్ర ప్రదీప్‌, రవి, సరస్వతి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని