logo

భాజపాలో పలువురి చేరిక

అసెంబ్లీ ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయిందని, హామీలు నెరవేర్చక కాంగ్రెస్‌ పని ఖతమయ్యిందని ఖమ్మం లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు.

Published : 06 May 2024 01:52 IST

మాట్లాడుతున్న భాజపా అభ్యర్థి వినోద్‌రావు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయిందని, హామీలు నెరవేర్చక కాంగ్రెస్‌ పని ఖతమయ్యిందని ఖమ్మం లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. సింగరేణి మండలం నుంచి భారాసకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఖమ్మంలో భాజపాలో ఆదివారం చేరిన సందర్భంగా వినోద్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్‌, భారాస కొన్నేళ్లుగా గిరిజనులు, దళితులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నాయని ఆరోపించారు. మోదీ నేతృత్వంలోని భాజపా మాత్రం గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి కట్టబెట్టి సముచిత స్థానం కల్పించిందన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, కృష్ణనాయక్‌, మోహన్‌ రాథోడ్‌, నెల్లూరి కోటేశ్వరరావు, నున్నా రవికుమార్‌, శ్రీనివాస్‌, అంజయ్య, అజ్మీర వీరన్న పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని