logo

కొనసాగుతున్న పోలీస్‌ పికెట్‌

పెడనలోని తోటమూలలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణంగా ఏర్పాటు చేసిన పోలీస్‌ పికెట్‌ కొనసాగుతోంది. గత ఏడాది వినాయక నిమజ్జన సమయంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది యువకులు మరో వర్గంపై దాడికి పాల్పడ్డారు. సకాలంలో

Published : 17 Jan 2022 02:06 IST

బాధ్యులపై రౌడీషీట్లు తెరిచేందుకు చర్యలు

పెడన, న్యూస్‌టుడే: పెడనలోని తోటమూలలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణంగా ఏర్పాటు చేసిన పోలీస్‌ పికెట్‌ కొనసాగుతోంది. గత ఏడాది వినాయక నిమజ్జన సమయంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది యువకులు మరో వర్గంపై దాడికి పాల్పడ్డారు. సకాలంలో స్పందించిన పోలీసు అధికారులు హుటాహుటిన అదనపు బలగాలను తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అప్పట్లో 15రోజుల పాటు పికెట్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా మూడ్రోజుల క్రితం ఫ్లెక్సీ వివాదం విభేదాలను రగిల్చింది. ఓ ప్రజాప్రతినిధి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది యువకులు పెడన-విస్సన్నపేట బైపాస్‌ రహదారి పక్కగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని మరో వర్గానికి చెందిన యువకుడు వరుదు శివకుమార్‌తో పాటు మరికొందరు ప్రతిఘటించారు. ఈఘటనలో శివకుమార్‌పై ఏడుగురు యువకులు దాడికి పాల్పడినట్లు ఐపీసీ సెక్షన్‌ 324 కింద కేసు నమోదైంది. దీంతో రాత్రికి రాత్రి ఆప్రాంతంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటుచేశారు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలోనూ 9వ వార్డు పరిధిలోకి వచ్చే ఈప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. వరుస సంఘటనలతో ఈప్రాంతం పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలోకి వెళ్లింది. ఈనేపథ్యంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో వరుసగా గొడవలకు పాల్పడుతున్న యువకుల్ని పోలీసులు గుర్తించారు. ఒకటికి మించి కేసులున్న యువకులు దాదాపు 20మంది ఉన్నట్లు తేలిందని, త్వరలో రౌడీషీట్లు తెరుస్తామని ఎస్సై టి.మురళి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని