logo
Published : 04/12/2021 04:45 IST

పంట రుణాలపై ప్రత్యేక దృష్టి


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు, జేసీ (ఆసరా) శ్రీనివాసులు, నాబార్డు డీడీఎం పార్థవ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రైతులకు పంట రుణాలిచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. 2021-22 వార్షిక ప్రణాళిక లక్ష్యం రూ.17,177 కోట్లు కాగా సెప్టెంబరు నెలాఖరుకు 57.03 శాతం మాత్రమే ఉంది.. నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. ఎంఎస్‌ఎంఈ సెక్టారులో రూ.1,940 కోట్ల లక్ష్యాన్ని ఇవ్వగా కేవలం 37.23 శాతమే సాధించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పథకం కింద ఏడు దరఖాస్తులు బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, వీవర్స్‌ ముద్ర పథకం కింద 11 బ్యాంకులకు 391 దరఖాస్తులు పంపగా 45కు మాత్రమే రుణాలు మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 స్టాండప్‌ ఇండియా కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు ఇవ్వాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు జిల్లాలోని 481 బ్యాంకు శాఖల నుంచి.. ఒక్కో బ్రాంచి నుంచి కనీసం రెండు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు.

నాబార్డు ఆధ్వర్యంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి పొటెన్షియల్‌ లింక్‌డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు.

2021-22లో పీఎల్‌పీ కింద రూ.16,161 కోట్ల లక్ష్యం కాగా 2022-23 సంవత్సరానికి రూ.17,457.13 కోట్ల ఇచ్చేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తూ నాబార్డు రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. నాబార్డు డీడీఎం పార్థవ, జేసీ (ఆసరా) ఎంకేవీ శ్రీనివాసులు, ఎల్‌డీఎం వెంకటనారాయణ, ఆర్‌బీఐ జిల్లా అధికారి రెహ్మాన్‌, కెనరా బ్యాంకు అధికారిణి సుమలత, జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

2022-23 రుణ ప్రణాళిక (రూ.కోట్లు)

వ్యవసాయ రంగం : 13,830

ఎంఎస్‌ఎంఈ : 2,404

ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ : 4.5

విద్య : 188

గృహ నిర్మాణం : 968

రెన్యూవబుల్‌ ఎనర్జీ : 10

సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ : 49

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని