logo

విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి

కరోనా తగ్గుముఖం పట్టే వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని, విద్యార్థుల, ఉపాధ్యాయుల ప్రాణాలు కాపాడాలని విద్యార్థులు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కోరారు. బుధవారం తెదేపా రాష్ట్ర కార్యాలయం నుంచి జూమ్‌ కాన్ఫరెన్సులో ఆయన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులతో

Published : 27 Jan 2022 05:22 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కరోనా తగ్గుముఖం పట్టే వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని, విద్యార్థుల, ఉపాధ్యాయుల ప్రాణాలు కాపాడాలని విద్యార్థులు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కోరారు. బుధవారం తెదేపా రాష్ట్ర కార్యాలయం నుంచి జూమ్‌ కాన్ఫరెన్సులో ఆయన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులతో సమీక్షించారు. నగరంలో కొవిడ్‌ బారిన పడినపడ్డ బాధిత పాఠశాలల విద్యార్థులతో నారా లోకేష్‌ మాట్లాడారు. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని, తమ ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్‌ఎస్‌ఎఫ్‌) కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, ప్రవీణ్‌, నాయకులు అబూబాకర్‌ సిద్ధిక్‌, కోటకొండ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని