logo

అంతర్జాతీయ పోటీలకు ఎంపిక

బ్యాంకాక్‌లో జులై 23 నుంచి జరిగే ప్రపంచ కప్పు సెపక్‌తక్రా పోటీలకు కర్నూలు నగరానికి చెందిన శివకుమార్‌ ఎంపికైనట్లు సెపక్‌తక్రా సంఘం జాతీయ సంయుక్త కార్యదర్శి జి.శ్రీనివాసులు తెలిపారు. దేశ జట్టుకు ఎంపికైన శివకుమార్‌ను

Updated : 26 Jun 2022 03:44 IST

క్రీడాకారుడు శివకుమార్‌ను అభినందిస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు క్రీడలు (బి.క్యాంపు), న్యూస్‌టుడే: బ్యాంకాక్‌లో జులై 23 నుంచి జరిగే ప్రపంచ కప్పు సెపక్‌తక్రా పోటీలకు కర్నూలు నగరానికి చెందిన శివకుమార్‌ ఎంపికైనట్లు సెపక్‌తక్రా సంఘం జాతీయ సంయుక్త కార్యదర్శి జి.శ్రీనివాసులు తెలిపారు. దేశ జట్టుకు ఎంపికైన శివకుమార్‌ను కలెక్టర్‌ కోటేశ్వరరావు శనివారం ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కర్నూలు క్రీడాకారుడు అంతర్జాతీయ పోటీలకు ఎంపికవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం అతడిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా సంఘం రాష్ట్ర కార్యదర్శి అవినాశ్‌శెట్టి, స్కేటింగ్‌ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని